#772

పరిశుద్ధాత్ముడా, పావన రూపుడా

రచయిత: గోవాడ దేవమణి

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధాత్మ, పావన రూపుడా – నిత్యుడవగు ఓ దేవా – నిరతము నీ సంఘములో నుండెడు – పరమోన్నత జ్వాల ఆది యందునగాధ జలములందల్లాడిన దేవా – ఈవుల నొసగుచు సాక్షులను జేసిన దేవా ||పరి||
చరణము 1
1. ఆది భక్తులందరిని నడిపిన ఆత్మయౌ దేవా – సాధులగు ప్రవక్తల బోధలు మాకందించిన దేవా ఆ మహా శూరత అతి ధైర్యంబులు – అతులిత జ్ఞానము తగు వివేకము లొసంగిన దేవా – అనయము తెలియ – ఘన భయ భక్తులు మాకందించిన దేవా ||పరి||
చరణము 2
2. పెంతెకొస్తున భువికరుదెంచిన ప్రేమయౌ దేవా – పరమునుండి ప్రత్యక్షుడవై విభాగించి పొందిన భక్తులకు ప్రవచన వరములు పలు విధ భాషలు పరమాద్భుతములు పరగ నొసంగిన దేవా – పోయుము నీ కృప వరములతో ఇప్పుడు నీ సభ బలపడగా ||పరి||
చరణము 3
3. ఆత్మ వరంబులు – ప్రేమా ఫలములు దయచేసిన దేవా – ఆత్మ జ్ఞానము నీతిఫలంబులు తేటగ మాకిమ్ము – నవ జీవితము నిర్మల భక్తియు నిత్య జీవము – ఇహమున నేను నమ్మి – నిరతమున సంఘములో మేము వరములతో పెరుగన్ ||పరి||
చరణము 4
4. ఆవరించుచున్నవి (లేదా ఆదరించుచున్నవి) నీదు సంఘములు ఆత్మయౌ దేవా – ఓర్పుతో మా సంఘంబులందుండి నేర్పుతో నడిపించు చుండిన శల్యములను గుమి గూర్చి – ఎలమిని జీవింపను చేయు – పోయుము నీ సత్యాత్మతో – సభలోను జీవము నొంద ||పరి||
చరణము 5
5. ధన్య మరియు నావేశించి ప్రభు యేసుని మా కిచ్చి పుణ్య బోధలు దివ్యాద్భుత జీవితమును చూపి – ఘనుని సిలువ మరణ పునరుత్థానారోహణ ఫలములు చూపి పన్నుగ మాతో జన సహాయకారియై జీవింపగ జేసి