#773
దైవ రాజ్యపు జీవితము ధన్య జీవితము
పల్లవి · Pallavi
ధన్య జీవిత మరయ రండి – మాన్యుడేసుని జీవిత ముండి – ఘనుడేసు బోధించెనండి – దివ్యమైన కొండ నుండి ||ధన్య||
చరణము 1
1. ఆత్మయౌ యందు దీనులైన వారు బహు ధన్యులండి – దైవరాజ్యము వారిదటంచు – ప్రభువు యేసే తెల్పినాడు సుండి ||ధన్య||
చరణము 2
2. పాప పశ్చాత్తాపంబొంది పరగ దుఃఖము నొందెడు వారలు – ప్రభుని వలన నాదరణ నొంది పరమ సంతోషమున చేరెద రండి – ఇల సాత్వికులే ధన్యులండి దైవసుతుడు సెలవిచ్చెనండి – ఇహలోకము స్వతంత్రించుకొని ధన్యులై జీవించెద రండి ||ధన్య||
చరణము 3
3. నీతి యందు ఆకలి దప్పులను మతిలో కలిగిన విచారముల నుండి – తృప్తి తీరదీవెనలండి – కీర్తనలతో జీవించెదరండి ||ధన్య||
చరణము 4
4. కనికరము గలవారే ధన్యులు – కనికరమునే పొందుదురండి – కరుణ గల శ్రీయేసుని వలెనే కనికరమునే చూపుదు రండి ||ధన్య||
చరణము 5
5. శుద్ధ హృదయములు ధన్యులటంచు – శుద్ధుడగు శ్రీ యేసుని – సుబుద్ధితోడివారు దేవుని నిత్యము దర్శించెద రండి ||ధన్య||
చరణము 6
6. శాంతిని నెలకొల్పిన వారు – కాంతిగల దేవుని పుత్రులు – కాంతితో దేవుని స్వరూపము – నొంది భువిలో పెరుగుచుందురు ||ధన్య||
చరణము 7
7. నీతి కొరకై హింసలొందెడు – నాయకులే బహు ధన్యులండి – దైవరాజ్యము వారిదటంచు – ప్రభువు క్రీస్తే తెలిపెనండి ||ధన్య||
చరణము 8
8. నిందలు అబద్ధపు చెడ్డ – వాదులు మీరి – హింసలైన మెండుగా మీ పైబడియున్న – దండిగా యానందించండి ||ధన్య||
చరణము 9
9. ఉప్పుసారము కలిగి మీరు జీవిత మరయ రండి – ఒప్పు మీర ప్రభుని వలెను – తప్పకను జీవించ రండి ||ధన్య||
చరణము 10
10. దీపముల వలె లోకమందు దివ్య వెలుగును చూప రండి – దైవ వెలుగే మీ యందు ఉండు దివ్యులై ప్రకాశించండీ ||ధన్య||
చరణము 11
11. సత్య జీవిత మరయ రండి – సత్క్రియలనే చేయరండి – సుప్రకాశమైన వెలుగు – లోకమందు చూపరండి ||ధన్య||