#771

శత్రువులు – చింతలందు ప్రార్థన

రాగం: (దావీదు కీర్తన 3) · రచయిత: గోవాడ దేవమణి

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవా నన్నుబాధించువారు లేచి యున్నారు – భువి యందు శత్రువులు నన్నుచుట్టియున్నారు – అవనిలో బహు గేలి చేయుచు నన్ను చాటుచున్నారు.||దేవా||
చరణము 1
నీవే నాకు కేడెముగానూ –నా తల నెత్తిన బలశూరుడవని నా – అతిశయ కారణ భూతుడవని నీ శరణుని నమ్మితి కరుణతో బ్రోవవే ||నా దేవా||
చరణము 2
కంఠమెత్తి నేమొరలిడునప్పుడు – మింట నుండి నాకభయ మిచ్చితివి సందిట నన్నుచేర్చియుంటివి ఒంటరినై నీ కడ నుండగా ||నా దేవా||
చరణము 3
నేను పండి నిద్రించుచుండగా –వినె వేరు శత్రువులు చుట్టగ నన్ను – పన్నుగా గాచి నన్ను దీవించితివి –వినయముగా నిను నే స్తుతియింతును ||నా దేవా||
చరణము 4
వ్యాధులు – బాధలు, శోధనలు లీ బహు –వ్యాకులములు పలు నన్నుక్రమ్మిననుండగా – మేదిని – దయయు ని నమ్మితిని నన్ను ఆదరమున నీ దయచూపించిన ||నా దేవా||
చరణము 5
జనక సుత శుద్ధాత్మకు మహిమయు – ఘనతయు స్తోత్రము నిరతంబునూ అనయముగా నీకే చెల్లును – తరములు నీకు మహిమౌ గాక ||నా దేవా||