#770

క్రైస్తవ జీవిత సూత్రములు

రచయిత: గోవాడ దేవమణి

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
సామాన్యమటండే – సత్క్రైస్తవులై జీవించుట – పరిపూర్ణులై జీవించుట ||సామాన్య||
చరణము 1
మారుమనస్సు కలిగియుండ వలెను –మూఢగుణములు మానవలెను మోస కృత్యములు విడువవలెను – మహిని క్రీస్తునే సేవించవలెను ||సామాన్య||
చరణము 2
గాలి ధూళి సైతాను పూజలు – పలుమత మాయ పూజలు సదమలముగా శారీర క్రియలు మానవలె లోక భోగము లెల్ల ||సామాన్య||
చరణము 3
తండ్రి దేవుని విశ్వసించాలి – కుమారుడేసునికృపను నమ్మాలి – పావనాత్మునిమదినమ్మాలి – పరిశుద్ధ త్రిత్వమునే నమ్మియుండాలి ||సామాన్య||
చరణము 4
దశరాజ్ఞలను స్మరించాలి – దైవ వాక్కులను మదినంచాలి – దైవయేసుని పోలినడవాలి– దైవ గ్రంథమునే పఠించుచుండాలి ||సామాన్య||
చరణము 5
సిలువ గుర్తు నొందె విశ్వాసులంతా – సిలువ క్రీస్తుని విశ్వాస మందు – సిగ్గునొందక భువిలో నొప్పుకొనుచు – చావుదనుక సాక్ష్యమిచ్చుచుండాలి ||సామాన్య||
చరణము 6
దేవుని బిడ్డలమై – బ్రతుకుచుండాలి – దైవరాజ్యము నొంది యుండాలి –దేవయేసుని దేహమవాసి – దేవుని నిత్యము ప్రార్థించుచుండాలి ||సామాన్య||