#769
దైవనరావతార సప్త ఫలములు
పల్లవి · Pallavi
దేవుడే – అవతారుడాయెను – సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయెనుదైవవక్తలు ఏండ్ల తరబడి దైవరాకను భువికి తెలుపగా – దేవదూతలుగా మూలాకాశ మంగళ హారతులతో ||దేవుడే||
చరణము 1
భువినికన్య మరియాంబ గర్భమున – బెత్లేహేమనెడు దావీదు పట్టణమందున– పన్నుగానరపుత్రుడై – యా పశువులశాలలో జన్మమొందెను – పొత్తిగుడ్డలచుట్టబడియు – పశువుల తొట్టెలో పరుండబడెను ||దేవుడే||
చరణము 2
పాపహరుడైజన్మమెత్తెను – పాపులను బ్రోవ ప్రాణ బలినే చేయవచ్చెను – ప్రాణ బలిచే తండ్రిప్రేమను పుడిమిలో ప్రత్యక్ష పరచెను – పాప ప్రాయశ్చిత్తమైతనశాంత ఫలమునే మన కియ్యవచ్చెను ||దేవుడే||
చరణము 3
సాతానుక్రియలు – మోసకృత్యములు – హతమార్చుటకు యా దివ్య సుతుడుగానవతరించెను – భూతములు పిశాచి పీడితులందరిని రక్షింపవచ్చెను –వాస్తవంబుగా లోకమందు పిశాచి నేలయముపరచ వచ్చెను ||దేవుడే||
చరణము 4
జీవమియ్యను జన్మమెత్తెను – సంపూర్ణ జీవము మానవులకు తాను తెచ్చెను – దైవజీవమే తానటుచు దృఢముగా సెలవిచ్చియుండెను – దేవ జీవమే మనకు నియ్యబాల శిశువై జన్మమెత్తెను ||దేవుడే||
చరణము 5
రక్షకుడుగానవతరించెను – మన పక్షమున తా శిక్షలన్ని భరింపవచ్చెను –రోగములలో వ్యాధులందు – శోధనలు మరి కీడులందుఎట్టి కాలము నందైన దండి రక్షకుడై యుండు ||దేవుడే||
చరణము 6
సత్య దేవుని ఎరుగునట్లునూ – మానవులంతా నిత్య తండ్రిని తెలిసికొనుటకునూ–తానే దేవుని రూపమై – తన దివ్య జ్ఞాన వివేకముల బోధలందుమనకు నిచ్చి – తండ్రి ప్రేమను మనకు చూపెను ||దేవుడే||
చరణము 7
దేవునివాక్యమే శరీరమాయెను – దైవ పరిపూర్ణ తింతే క్రీస్తునందే నివాసమాయెను – దైవ పూర్ణుడుడైన క్రీస్తుని కృపయు సత్య సంపదలతోఆత్మ రూపమందు నిత్య నివాసుడై యుండ వచ్చెను ||దేవుడే||