#766
వరనామమే యేసు వరనామమే శుభనామమే క్రీస్తు శుభనామమే వరనామమే శరణు వరనామమే శుభనామమే శరణు శుభనామమే
పల్లవి · Pallavi
వరనామమే యేసు వరనామమేశుభనామమేక్రీస్తు శుభనామమే వరనామమే శరణు వరనామమేశుభనామమే శరణు శుభనామమే
చరణము 1
ఉన్నాను అనువాడు వరనామమేఎన్నడూ మారడు వరనామమే దేవుడుమనతోడు వరనామమే నిన్న నేడు ఎప్పుడు వరనామమే ||వర||
చరణము 2
సర్వశక్తి దేవ వరనామమేచూచుచునున్న దేవ వరనామమేసైన్యముల అధిపతి పరనామమేఆద్యంతముల కాంతి వరనామమే ||వర||
చరణము 3
దయాసముద్రుడు యేసు వరనామమే పరలోకతేజస్సు వరనామమే నీతి సూర్యుడు యేసు వరనామమేసాటిలేని యేసువరనామమే ||వర||