#765

సహోదరులంతా ఏక్యత కలిగి నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం మనోహరం ఎంతో మనోహరం సహోదరులైక్యత మనోహరం

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం
అనుపల్లవి · Anupallavi
మనోహరం ఎంతో మనోహరంసోదరులైక్యత మనోహరం
చరణము 1
తలపై పోసిన পরিమళ తైలముఎంతో మనోహరం – పరిమళ – ఎంతో మనోహరంఅహరోను గడ్డము మీదుగా అంగీల అంచుల వరకుజారెడు తైలంమనోహరం ||మనోహరం||
చరణము 2
సీయోను కొండలపైన వర్షించు హిమముఎంతో మనోహరం – హిమము – ఎంతో మనోహరంహెర్మోను కొండనుండి ప్రవహించు మంచు వంటిఐక్యత ఎంతమనోహరం ||మనోహరం||
చరణము 3
దివినుండి వచ్చిన దైవకుమారుడుఎంతో మనోహరం – యేసు – ఎంతో మనోహరం సహవాస జీవితాన ఆ ప్రభుని దీవెన వానఎంత మధురంమనోహరం ||మనోహరం||