#764

ఆ.....ఆ......ఆ..... నా హృదయం స్థిరమాయె స్తుతి గానము నే చేసెదను నా ఆత్మయు స్థిరమాయె ప్రభు యేసుని నే పాడెదను ||నా||

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆ.....ఆ......ఆ.....నా హృదయము స్థిరమాయె స్తుతిగానము నే చేసెదనునా ఆత్మయు స్థిరమాయె – ప్రభుయేసుని నే పాడెదను ||నా||
చరణము 1
నీ కృప ఎంతో ఎత్తైనది నీ సత్యం బుద్ధి ఘనమైనది నీకృపలో, నింపగ నన్ను సరి చేయుము నా జీవితము ||2|| ||నా హృదయము||
చరణము 2
వ్యధలెన్నో నన్ను చుట్టినను తుదకు మరణమేచేరినను విడువను ప్రభువా, నీ సన్నిధిని విడనాడను నీ పెన్నిధిని ||2|| ||నా హృదయము||