#762

శరణం శరణం నా ప్రియ యేసు చేరితి నీ దరిని నా దేవా ||శరణం||

రచయిత: వెరి. రెవ. జి.ఎస్. సువర్ణరాజు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
శరణం శరణం నా ప్రియ యేసుచేరితి నీ దరినినా దేవా ||శరణం||
చరణము 1
ఎన్నో అపరాధము లొనరించితికన్నులే కానక చరియించితిమన్నించుటకు పాత్రుడను కానుకనికరపూర్ణుడా కృపనే చూపుమా ||శరణం||
చరణము 2
చెడుగులతో జత చేసితీనిఅడుగులు తడబడ నడియాడితినిఇడుముల పాలై పతనము నొందితికడకే నా దరిశరణని చేరితి ||శరణం||
చరణము 3
రక్షణ నొసగి పావన పరచిఅక్షయ భాగ్యము నొసగితివిమోక్షపదమ్మున నన్ను నడిపితివిరక్షకుడా గైకొనుమా వందనం ||శరణం||
చరణము 4
నమ్మితి నయ్య నీ చరణంబులనెమ్మది నొసగుము నా మదికి నమ్మిన వారికి ఆదరమిచ్చెడి సమ్మతుడానా సద్గుణాల విభుడా ||శరణం||