#761
యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందుకు సాగుదమా జీవిత యాత్రాలో దేవుని సేవలో
పల్లవి · Pallavi
శ్రీ యేసుని స్తోత్ర గీతం కలసిపాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందరకు సాగుమాజీవిత యాత్రలో దేవుని సేవలో
చరణము 1
అపొస్తలుల జీవితం హతసాక్షుల అనుభవంకావాలి జీవిత ఆదర్శముకలిగి యుండాలి స్థిర విశ్వాసముయేసువైపు చూచుచు సిలువ భారం మోయుచుసాగించు నీ యాత్రిక పయనము ||సంఘమా||
చరణము 2
ఇంటింట ప్రార్థన – ప్రతిసంఘారాధన మరవవద్దు ప్రభు సంస్కారముకలసి ధ్యానించు దేవుని వాక్యముఅవయవాలు ఎన్నివున్నా ఒక్కటే శరీరంసాగించు సమసమాజ జీవనం ||సంఘమా||
చరణము 3
కపట సాక్షులు ఎందరోక్రీస్తు దేవుడు కాడనిపలుకు తియ్యని తేనె బోధలు నమ్మకుపూర్వనమ్మిక నుండి ఎన్నడూ తొలగకుప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకుసాగించు ప్రగతి పథమున జీవితం ||సంఘమా||
చరణము 4
క్రియలు లేని నమ్మిక సాగించకుఇక పొరుగువాని ప్రేమించు నీవలెశత్రువులను మన్నించు ప్రభువువలెఅవసరములో ఉన్నవాని ఆదుకొనుటయే న్యాయముసాగించు ఈ ధర్మ కార్యంబు ||సంఘమా||
చరణము 5
ప్రభుని వార్త ప్రకటన ప్రజల కొరకై నివేదన నీ ధ్యేయముకావాలి సంఘమాఈ భారం నీదే గమనించుమాత్రియేక దైవం అందించు సాయంసాగించు ప్రభుని వార్త మహోద్యమము ||సంఘమా||