#760
సమృద్ధి జీవమా – సంపూర్ణ ప్రేమయా సజీవ వాక్యమా – మా యేసు దైవమా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా
పల్లవి · Pallavi
సమృద్ధి జీవమా – సంపూర్ణ ప్రేమయా సజీవవాక్యమా – మా యేసు దైవమా హల్లెలూయా – హల్లెలూయాహల్లెలూయా – హల్లెలూయా
చరణము 1
తీరని వ్యాధితో – దరినెవరూ లేకమారని వ్యధలతో – నిరీక్షణ లేమితోకరుణామయు దరిని – కనుగొంటివి నన్నుمరణము బాపి – జీవము నిచ్చితివి ||సమృద్ధి||
చరణము 2
పాపపు దాహముతో – లోకపు మోహములో శాపమేజీవితమై – ముఖము చూపలేక తాపపు వేళలో – బావికి పరుగెడిప్రభునే గాంచి – జీవజలం పొందితి ||సమృద్ధి||
చరణము 3
అంధుడనైతినే – చీకటి బ్రతుకులో వీధుల తిరుగాడితి– జీవన లేమితో పరిపూర్ణ ప్రేమతో – కరమును చాపివెలుగును నొసగి – జీవమునిచ్చితివై ||సమృద్ధి||
చరణము 4
ఎంతో వ్యయపరచితి – స్వస్థతనొందుటకై చెంతకు రారెవరూ – నా స్థితి గమనించి కరుణామయుని – చెంగుని తాకివింతను గాంచితి – నవజీవ మొందితి