#759

దినమంతా ప్రభు స్తుతియింతు అనయము యేసుని భజియింతు అనిశము దేవుని ఆరాధింతు – 2 తనువు మనసు అర్పణచేతును ||దిన||

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
దినమంతా ప్రభు స్తుతియింతుఅనయము యేసుని భజియింతుఅనిశము దేవుని ఆరాధింతు – 2తనువు మనసు అర్పణచేతును ||దినమంతా||
చరణము 1
నా అంతరంగమా – నాసమస్తమా పరిశుద్ధ దేవుని స్తుతియించుమాఆయన చేసిన ఉపకారములను– 2దేనిని నీవు మరవకుమా – 2 ||దినమంతా||
చరణము 2
నీ దోషముల క్షమించువాడు నీ సంకటములు తానే కుదుర్చున్నా ప్రాణమును మరణము నుండి – 2తానే తప్పించి, విమోచించువాడే – 2 ||దినమంతా||
చరణము 3
నీ ప్రార్థనలకు చెవియొగ్గువాడునీ మొరలను తానాలకించునునీ శ్రమలన్నిట ఆసన్నుడుగా నిన్ను కాపాడునుకరుణించున్ ||దినమంతా||