#756
సమృద్ధి జీవము క్రీస్తుని లో పొందుడి ప్రియులారా ప్రవహించుచున్నది జీవ నది త్రాగుడి ప్రభు పేర యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము
పల్లవి · Pallavi
సమృద్ధి జీవము క్రీస్తుని లో పొందుడి ప్రియులారా ప్రవహించుచున్నది జీవ నది త్రాగండి ప్రభు పేరయేసే నిత్య జీవము యేసే జీవ మార్గముయేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము
చరణము 1
జీవుల కన్నులు ప్రభువైపు – చూచుచూ ఆహారముకొరకైప్రేమతో దయచేయును ప్రభువు – కోరిన వరములను
చరణము 2
జీవన ఊటలు హృదయములో –ప్రవహింపజేయును ప్రభు యేసు జీవన దాత మన చెంత – జీవితకాలమంత
చరణము 3
ఎండిన ఎముకలు బ్రతికెగదా –నిండుగ జీవ శరీరముతోలేచిరి మృతులు ప్రభుపిలువ – జీవన సాక్షులుగా
చరణము 4
మరణమే మరణంచెందెను చూడు – సిలువలో యేసుని మరణముతోలేతురు మృతులు ఒక దినము– మహిమ శరీరముతో
చరణము 5
క్రీస్తు శరీర సహజములలో –క్రీస్తులో పోలి నడిచెదముప్రభు భోజన సంస్కారములో– జీవము పొందెదము