#755

అద్భుతమైన నీ కృపలో మమ్ము మలచుము ఓ ప్రభువా అనంతమైన నీ కృపలో మమ్ము మార్చుము ప్రభువా మమ్ము మార్చుము

రచయిత: రెవ. జి.ఎస్. సువర్ణరాజు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
అద్భుతమైన నీ కృపలో మమ్మును మలచుము ఓ ప్రభూఅనంతమైన నీ కృపలో మమ్మును మార్చుము ప్రభూమమ్మును మార్చుము
చరణము 1
ఎన్నో అపరాధముల నెరిగి చేస్తిము ఇచ్ఛవచ్చిన మార్గము తొలగి తిరిగితిమికానరాని క్రియలెన్నో చేసిమనసున శాంతి లేదాయెను ||అద్భుత||
చరణము 2
స్వనీతియే మా కృత నిశ్చయమాయెను సత్క్రియలే మా కాస్పదమాయెనుమతి లేని క్రియలతో మేము అలసి యుంటిమిపతితులమై కృపన్ వేడితిమి ||అద్భుత||
చరణము 3
కల్వరిలో మా కలుషము బాపితివి సిలువలో బలియై ప్రేమను చూపితివి విలువను కూర్చిమమతల నొసగగపలువిధ కృపలను ఇచ్చితివి
చరణము 4
నీ కృపయే మా భయమును తీర్చెను పాపము బాపి మా కభయము నిచ్చెను నీ కృపయే మా కాధారమాయెనుమా దోష భారము తొలగించెను ||అద్భుత||