#753

యేసు క్రీస్తును – జీవ వాక్యమా నన్ను నడుపుమా – మోక్షపదమున ||

రచయిత: సి.ఎ.జె.ప్రసాదరావు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు క్రీస్తును – జీవ వాక్యమా నన్ను నడుపుమా –మోక్షపదమున ||
చరణము 1
ఆదినుండి తండ్రితో – కలసియున్న వాక్యమా పరిపూర్ణమైన –సంతోషముంగల సహవాసమును గూర్చుమా ||
చరణము 2
లోకమునకు వెలుగై – తేజరిల్లు వాక్యమా జీవంపు వెలుగు –ప్రసరింప జేసి కనువిప్పు కలిగింపుమా ||
చరణము 3
సత్యమైన వాక్యమా నిత్యమైన వాక్యమావాక్యంబు నెప్పుడు – గైకొంచు నడువపరిపూర్ణ స్థితి నిమ్ముమయా ||
చరణము 4
ప్రాణమే యర్పించిన – ప్రేమయైన వాక్యమామరణంబు నుండి – జీవంబు నొందేపరమున్ ప్రసాదించుమా ||
చరణము 5
మంచి చెడుల నెల్లను – ఎంచి చూపు వాక్యమా వంచించు ఆత్మన్ – ఖండించిగెలవగ పరిశుద్ధాత్మ బలమిమ్ముమయా ||
చరణము 6
సజీవమై. శక్తియై – వాడియైన వాక్యమా ప్రాణాత్మలందు – శోధించి, వెదికిసంపూర్ణ స్థితినిమ్ముమయా ||