పల్లవి · Pallavi
రాగము : శంకరాభరణం తా : ఆదిదయగల మా ప్రభువా– కరునామయ యేసు భయభక్తులతో నీ మార్గములో జీవింప తోడ్పడుమా
చరణము 1
నీ వాక్యము నెల్లప్పుడు – వినువానిగనే గాక నీ వాక్యాను సారముగా – జీవింపతోడ్పడుమా ||
చరణము 2
''ప్రభువా—— యని పిలువగనే– ప్రభు రాజ్యము దొరకదు ప్రభు దేవునిచిత్తముగా– జీవింప తోడ్పడుము ||
చరణము 3
నీ ధర్మశాస్త్రము నెల్లన్ – అనుసరింప గలవాడనై నీతిమంతునిగా నెంచబడన్ – జీవింప తోడ్పడుమ ||
చరణము 4
నీ మాటలు పాటించి – స్థిరమగు పునాది వేయు బుద్ధి గలవాని బోలి జీవింపతోడ్పడుమా ||
చరణము 5
ఇతరుల రక్షణ కొరకు – నిరతము కృషి సలుపుచును ఇతరుల యెడ నీ వలెనే – జీవింప తోడ్పడుమ ||