#750

లే లెమ్ము అంతరాత్మ లేచి త్వరగా సిద్ధపడుమ

రచయిత: సి.ఎ.జె.ప్రసాదరావు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
రా : శంకరాభరణం తా : త్రిశ్రగతి...........లే లేమ్ముఅంతరాత్మ లేచి త్వరగా సిద్ధపడుమా
చరణము 1
యేసుప్రభువు భూజనులను – తీర్పుతీర్చు తరుణమాయెనన్ కడబూరను ఊదగనే – మేఘంబుపైన ప్రభువు వచ్చున్ మోక్షంబునకో, నరకంబునకో నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
చరణము 2
నిర్లక్ష్యముగా, నిర్భయముగా – ఎంతకాలము నిదురింతువు, సర్వాధికారిప్రభువగు – న్యాయాధికారి, యేసు వచ్చున్, జీవంబునకో, మరణంబునకో – నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
చరణము 3
దైవభీతి, భక్తిలేక – ఎంతకాలము జీవింతువు – దైవదూతల్, జీవ గ్రంథంతెరిచి నీ క్రియలు తెలియ చదువున్ – పైకెత్తుటయో, దిగవిడుచుటయో నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
చరణము 4
మరణించినన్, జీవించినన్ – ప్రతివానికి తీర్పు గలదు – దూతలతో భక్తావారితో – ఆర్భాటముగానూ ప్రభువు వచ్చున్ – పరమ పదమో,అధోపదమో – నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
చరణము 5
దేవుని గొర్రెపిల్లయై – యేసు క్రీస్తు వరుడైవచ్చున్ వధువైనక్రీస్తు సమయమున– పెండ్లాడనై ప్రభువచ్చున్, పెండ్లి విందో, త్రోయబడుదో – निर्णयించే తీర్పు తీర్చున్ ||
చరణము 6
ఇప్పుడైన నీ పాపములను – పరిహరింపమని వేడుమ – ఇష్టుడైనను మారుమనస్సు పొందిన యెడల రక్షణ గలదు – కిరీటమో అగ్ని జ్వాలలలో – निर्णयించే తీర్పు తీర్చున్ ||