#749
క్రీస్తు పునరాగమనము
పల్లవి · Pallavi
క్రీస్తు పునరాగమనము''ప్రభువు రాకడ సమీపించుచున్నది... యాకోబు 5:8
చరణము 1
నీ రాక సమీపమంచు – నేనిప్పుడు గుర్తించియుంటి నీ రాక కొరకు నా జీవితంబును సిద్ధపరచుము నా యేసు ప్రభో ||
చరణము 2
నీ రాక నిజమయ్య తండ్రి – నేడో, రేపో, మరి ఇంకెప్పుడో ఏ వేళనైనా,ఆ మర్మమును, నే – మది దలచ కృప నిమ్మో ||యేసు ప్రభో||
చరణము 3
నీ నీతి లేశంబులేక – ఎన్నెన్నో పాపాలు చేయ వెనుకాడకుంటిని,మితిమీరిపోతిని – నన్ను నిలిపి స్థిరపరచుము ||యేసు ప్రభో||
చరణము 4
నా దీపమున నూనె లేదు – నా బ్రతుకున వెలుగే లేదు సద్భక్తినూనె శుద్ధాత్మ కాంతి – నా కొసగి వెలిగించుము ||యేసు ప్రభో||
చరణము 5
కడబూర మ్రోగెడి వేళ – మేఘములు నిన్ను మోయువేళ పరలోక వరుడా ఓగొర్రెపిల్లా – నీ యొద్దకు నన్నెత్తుము ||యేసు ప్రభో||
చరణము 6
విశ్వాస సంఘంబులోన – నీ జీవ గ్రంథంబులోన నా చేర్చబడగ,ముద్రించబడగ – రక్తముతో ముద్రించుము ||యేసు ప్రభో||
చరణము 7
నిత్యుండ సర్వాధికారి – నీ కొరకు కనిపెట్టుచుండ మోకాళ్ళు వంచిప్రార్థించుచుండ – నీ యాత్మను నా కొసగుమా ||యేసు ప్రభో||
చరణము 8
సర్వాంగ కవచంబు దాల్చి – వాక్యంబును ఖడ్గంబు బూని సాతాను తోడపోరాడుచుండ – బలమిమ్ము జయమిమ్ము ||యేసు ప్రభో||
చరణము 9
నీ తీర్పు దినమందు రాజా – నీతి మంతుల సంఘమందు నేనుండ గలుగకొనియాడగలుగ – నీతి వస్త్రము నిమ్ము ||యేసు ప్రభో||
చరణము 10
నేనన్ని సమయంబులందు – నేనన్ని కాలంబులందు నీతోడగలిసి,జీవింపగలుగ – అనుభవము కలిగింయుము ||యేసు ప్రభో||