#748
ప్రార్థన
పల్లవి · Pallavi
ప్రార్థన''అడుగడి మీ కియ్యబడును. వెదకడి మీకుదొరుకును—— మత్తయి 7:7వేచియుంటి నేనయ్యా – ఆశతోడ నీ కొరకు ||వేచి||
చరణము 1
ఆశ్రయించి అడుగువారికి – అక్కరలను తీర్చెడిఆశ్రయంబు నీవమనుచు – అభయమిచ్చి గావున ||వేచి||
చరణము 2
పట్టుదలతో నుపవసించి ప్రార్థనలను సల్పెడిభక్తున్ దర్శించి నీదు – శక్తినిత్తు గావున ||వేచి||
చరణము 3
వ్యాకుల భావ మెరుగలేక – ఆత్మ నంపి తెలుపమనగావాక్య భోజనంబు నిచ్చి జీవమిత్తు గావున ||వేచి||
చరణము 4
కుమిలి కుమిలి నీరసిల్లి – నలిగి విరగే గానలేకకూర్మితోడ వెదికి వెదికి – విమోచింతు గావున ||вечи||
చరణము 5
మనస్సునందు శాంతిలేక – మార్గమేమి గానలేకగాంచి బ్రోవుమను చే వేదన – శాంతి గూర్తు గావున ||వేచి||
చరణము 6
చెడ్డమనసు ప్రేరణమున – చెడ్డపనులు చేయబూనశుద్ధమనసునంపి నన్ను – అడ్డగింతు గావున ||వేచి||