#747
రమ్ము యెహోవా రమ్ము ప్రభో
చరణము 1
రమ్ము యెహోవారమ్ము ప్రభో – క్రమ్ముము నాదు హృదయమును నాప్రార్థనకు నీ చెవియొగ్గి – నా మనవి నాలకించుటకై ||రమ్ము దేవ||
చరణము 2
విరివిగ వలచి లోకమును – దరిద్రము లెన్నో చేసి భరింపరాని భారమును– హరింపజేసి రక్షంపన్ ||రమ్ము దేవ||
చరణము 3
తలచి నాదు పాపములను – తలచి వాని ఫలితములను తలంపుకే మదిచెదరినది – తొలగింప నానాదు దురిత స్థితిని ||రమ్ము దేవ||
చరణము 4
కరములు చాసి పిలుచుచుండన్ – త్వరితపడి రమ్ము సహాయపడన్మొరాలకించుము చెవియొగ్గి – బిరాన నన్ను విడిపించుటకై ||రమ్ము దేవ||
చరణము 5
నా రక్షకుండు విమోచకుడై – ఆనంద సంతోషముల నిచ్చు నా దేవుని నేచూచుటకు – నేడే యాశించుచు వేచియుంటిని ||రమ్ము దేవ||
చరణము 6
శుద్ధముగు హృదయమును – సుస్థిరమగు విశ్వాసమును నిశ్చలభక్తినినా యందున – నూతనముగా పుట్టించుటకు ||రమ్ము దేవ||
చరణము 7
నిలిపితి నీపై నా మనసున్– నిలిపితి నీపై నమ్మికను చలింపకుండగ కాపాడున్ –పాలింప రమ్ము పరమ తండ్రి ||రమ్ము దేవ||
చరణము 8
కురిపించుము నీ యాత్మను నా పై – కురిపించుము నీ కృపను నాపై తరింపజేయుము నా తనువును – స్మరింతును నిన్ను నిరతమును ||రమ్ము దేవ||