పల్లవి · Pallavi
రాగము : మిశ్రనటభైరవి తాళము : త్రిశ్రగతిఅలసి సొలసి పోతిని –సేదతీర్చవా ప్రభూ!ప్రశాంత జీవ జలముల – త్రాగనిమ్ము నిండుగా ||
చరణము 1
దూరభారములను నేను – పారజూడబోవ గాలివాన సంభవించి – గుండెలోన గుబులు గలిగి ||
చరణము 2
ముందు వెనుక చూడక – చెంగు చెంగుమంచు నెగుర గుండురాయి కాలుదగల – గుండెలోన గుబులు గలిగి ||
చరణము 3
లోతుపాతులు ఎరుగక – ఎదురుగాను ఈదబోవగొంతుదాక మునిగిపోవ – గుండెలోన గుబులు గలిగి ||
చరణము 4
మంచి చెడుగు లెంచక – కొంటెగానుసంచరింప గృహంవారు రోసివేయ – గుండెలోన గుబులు గలిగి ||
చరణము 5
కీడు మేలు లందున – మేలు మార్గముందు బోవక కీడు సంభవించగానే – గుండెలోన గుబులు గలిగి ||
చరణము 6
జీవమరణమందలి – జీవమే మొగనలేకమరణమెదురు పడిన వేళ – గుండెలోన గుబులు గలిగి ||