పల్లవి · Pallavi
పశ్చాత్తాపము''ఇకమీదట నీ కుమారుడననిపించుకొనుటకు యోగ్యుడను కాననెను—— లూకా 15:21నిను తండ్రి యని బిలువ నేనెటుగాన దో దేవా ! నిను రానీయకహృదయమును మూసికొంటిన్ – పనికిమాలిన మార్గమున నడుచుకుంటి
చరణము 1
నోటితోడనే నిన్నొప్పుకొనుచుంటిన్ – మాటలోనే కాని మదిలోన లేదు –పాటింపకుంటికన్ బ్రతుకులోనయ్యో ||
చరణము 2
నిన్ను వలె పొరుగువానిని – సరిగా నెంచ – మన్న యాజ్ఞను నేనుమన్నించలేదు– అన్నీ నాకే కావాలె ననుకుంటుంటి నయ్యా ||
చరణము 3
నీ వాక్య పఠనంబు నీ నామధ్యానం – బేవేళ నామదికి వెగటుగదోచెనీవాక్యము నా చెవులు వినవాయెనయ్యో ||
చరణము 4
పరిశుద్ధుల సహవాస భావమే లేదు ఇరుగు పొరుగుల చెలిమిఇసుమంత లేదు– పరుల దూరము బెట్టి పరువంటినయ్యో ||
చరణము 5
సాతాను వలలోబడి చెలరాయించలేక – ఏతావుగానలేక నిలువైతి నకటా – నా తండ్రి యిక దిక్కు నాకెవరులేరే ||
చరణము 6
నిన్ను నమ్ముకొంటినిక నీవాడనౌదు – నన్ను ముట్టి, లేపి జ్ఞానము, జీవ మిచ్చి– మనస్సును, హృదయమును మార్చుము దేవా