#744
పశ్చాత్తాపము
పల్లవి · Pallavi
పశ్చాత్తాపమునీ చెడుతనమును మానక కొని మారుమనస్సు నొందిప్రభువును వేడుకొనుము అకార్య. 8:22యేసు ప్రభూ! నేనింతకాలము వృథాచేసితి, నా జీవితమంతటినన్ –అయ్యయ్యయ్యో ||యేసు||
చరణము 1
నాయేష్టమే – నా సౌఖ్యమే – నా సొగసే – నా స్నే హమేఇవియే నాకే – ఘనమంటిని – అయ్యో , మూర్ఖుడనైతి
చరణము 2
నీ వొసగిన – దేహంబును – నీవరములను – నీజ్ఞానమునునీ సేవకై – వాడనైతి – ప్రభువా – మన్నింపుమా
చరణము 3
నీవు గాక – వేరెవరు – దిక్కే నాకు – లేరంచును ఇప్పుడునేను – గ్రహింయుంటిని – ప్రభువా – గ్రహియుంటిని
చరణము 4
నీ శ్రమలే – నీ సిలువె – నీ రక్తమే – నీ త్యాగమేఇవియే నాకు – శరణ్యము – ప్రభువా – రక్ష్యణ్యము
చరణము 5
చాలునిక – లోకాశలు – చాలునిక నా యిష్టముఇప్పుడు నేనీవెంట వచ్చుదున్ ప్రభువాచేర్చుకొనుమా ||