పల్లవి · Pallavi
కృతజ్ఞతాస్తుతిదేవ యెహోవ – ప్రేమ స్వరూప – జీవ ప్రదాత ప్రభో ||
చరణము 1
దినదినమున నన్నెనరుతో గాకెడి – ఘనుడవు నీవే గదాగానము చేసెద ననిశము నిన్ను – ఘనత మహిమ కలుగ ||దేవ||
చరణము 2
సుందరముగు భూమ్యాకాశంబుల – చంద్రుదు మదినెంచనందలి సూర్యుని, చంద్రుని, చుక్కల – అందము నే గాంతును ||దేవ||
చరణము 3
గాలిని నీటిని సూర్యుని రశ్మిని – పూలను ఫలములనుమేలుల గూర్చగ సృజియించిన నీ – జాలిని స్మరింతును ||దేవ||
చరణము 4
ప్రేమించుటకై తల్లిదండ్రులను – ప్రియమగు గృహములను ఇమ్ముగ భోజనపానాదులను – కూర్మిని గూర్చితివి ||దేవ||
చరణము 5
పాపపు కూపములోనికి జారి – నా పోవుచు కేసి నేనుండగ – ప్రాపుగ యేసునికాపుగనిచ్చిన – కృపకై వందనములు ||దేవ||
చరణము 6
జనక సుతాత్మ త్రియేకుడు దేవ – ఆనయము స్తుతి మహిమ ఘన ముగ నీకుయుగ యుగములను కలుగునుగాక ఆమెన్ ||దేవ||