పల్లవి · Pallavi
పశ్చాత్తాపముయేసు ప్రభువా నన్ను గావు జీవదాయక నన్ను బ్రోవు (2)మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని (2)
చరణము 1
కరుణ సాగర కరములెత్తి – కరుణ కొరకు కాచుకొంటిని (2)మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
చరణము 2
సిలువ చెంత చేరితిప్పుడు – విలువ తెలిసి తిరిగి చేరితి (2)మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
చరణము 3
పాప పంకిల భార బ్రతుకును – పారద్రోలి పవిత్రపరచు (2)మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
చరణము 4
మధుర సేవ – నీదు సేవ జీవితాంతము చేసి తీరెద (2)మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద ||యేసు||
చరణము 5
నీదు సాక్షిగా నేను మార్గముగా – నీదు ప్రేమను పంచుము (2)పరలోక నివాసమునకు – పరుగెడు నన్ను చేర్చుకొనుము ||యేసు||