పల్లవి · Pallavi
రాగము : బాగేశ్వరి తాళము - ఆది తాళమునీ నీడలో – బ్రతుకు సాగాలని నీ బాటలో – నేను – నడవాలనిప్రభూ – నా జీవితాశ – నెరవేరునా – నెరవేరునా
చరణము 1
మతిలేక బ్రతికాను – గతిలేని బ్రతుకు క్షతిలారనివెతలన్ని – సంప్రాప్తమాయె హితమైన నీ వాక్య – భోజంబులోనేహితుడా నీ ప్రేమ – రుచి చూచినాను ||నీ నీడలో||
చరణము 2
బాంధవ్యములను లోక – బంధములలోనేబందీగ ఉన్నాను – పొందాను వ్యధనుబలియైన అలనాటి – నీ ప్రేమ జూసిబరువాయె మనసంత – శరణంటి నిన్ను ||నీ నీడలో||
చరణము 3
కన్నాను నీప్రేమ – కల్వరిలోనే విన్నాను నీ బోధ– వేదంబులోనేనన్నాదుకొనువారు – విశ్వాసము లేరుఉన్నావు నీవే – విమోచింప నన్ను ||నీ నీడలో||