#730

ఓ దేవా నేను నీ దాపున

రాగం: ఛాయ: ఓ దేవ నేను నీ దాపున · రచయిత: రెవ. జి.టి. మార్కు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
శ్రీ యేసు నీ పాద – సేవ చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చునునా యేసు నీ పాద సేవ చేయుటచేనా ఆయాసములన్నియును – అంతరించును ప్రభువా
చరణము 1
ఘోర పాపిని నేను – నేరంబులను చేసిదారి తప్పిన ద్రోహిని – కారుణ్యమయుడవేకరుణించి కాపాడి – దారిలో నన్నుంచిదరి చేర్చుము తండ్రి ||శ్రీ యేసు||
చరణము 2
దోషకారిని నేను – దోషంబులచేసిదోసిలొగ్గితి ప్రభువా – దాసుండనో యేసునాథా నీ దయచేత – దోషంబులనుబాపదాసునిగ జేకొనుము ||శ్రీ యేసు||
చరణము 3
సాతాను శక్తులను – సంధించి జయముందిసంతరిల్లిన యేసువా – నీతోనే నేనుండినిన్నే సేవించెద – సాతాను నోడించిశక్తి నియ్యుము ప్రభువా ||శ్రీ యేసు||
చరణము 4
అలనాడు శిష్యులను ఆదరించియు నెంతో అభయమిచ్చిన యేసువా – ఇల నే దీనుడనయ్యఅలముకొని యున్నట్టి – కలుష భారములెల్లతొలగజేయుము తండ్రి ||శ్రీ యేసు||
చరణము 5
నాదు జీవితమెల్ల – నీదు సేవకే నేనుధారవోయుదు నా ప్రభువానాథా నా రక్షకా నా సర్వస్వము నీవేనీ పాద సేవయే – నా జీవితాశయము ||శ్రీ యేసు||
చరణము 6
నీ కొరకే జీవించి – నిన్ను సేవించుచునీకొరకే మరణింతును – నీకే నా యాత్మను నిజమొప్ప నర్పించి నీ సన్నిధిలో నేనునిత్యముందును ప్రభువా ||శ్రీ యేసు||
చరణము 7
ఇదియే నా తుదియాశ – ఇదియే నా తుది కోరికఇదియే నా తుది ఆశయము – హృదయంబు నీ కిత్తు పదిలంబుగా నేను – సదయుండానిరంతంబు అందు నివసింపుము ||శ్రీ యేసు||