#729

యవ్వన సమాజం సవాలు

రాగం: ఛాయ : రాజాధి రాజ రారా · రచయిత: బోండ్ల సైమన్

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యౌవన సమాజము సవాలురారండీ – యువతి – యువకులారా – లేలండీ సిలువదారిపోవ రారాజు – యేసురాజు రాజ్యం – రయముగానూ – వచ్చునంచు చాట ||రారండి||
చరణము 1
ఓ............మారుతున్న నేటి – సమాజంబులో – ఓ ...మారనట్టి యేసు శక్తిచూపను మార్పుమనస్సు పొంది నీవు వేగ – మార్గదర్శి యేసు దారిపోవ – మానవాళి – మనస్సు వల్లమార్చి – మంచి సమాజంబును – నిర్మింపన్ ||రారండి||
చరణము 2
ఓ.......ప్రేమ లేని – నేటి సంఘజీవికి – ఓ ....ప్రేమమూర్తి – యేసుప్రేమ చూపుచు ప్రేమ శ్రేష్ఠమైనదంచు చాటి – ప్రేమ దారియెల్లరకును చూపి– ప్రేమధార గ్రోలి నీవు వేగ –ప్రేమధార – గ్రోలుడంచుచాట ||రారండి||
చరణము 3
ఓ.......రక్షణంపు – మార్గమేమో తెలియక –ఓ .......పాప రోగగ్రస్తులైన – పాపులన్ పరమవైద్యుడేసు చెంతకేగ – పాప రోగమెల్ల – పోవునంచు –భక్తితోడ – చాటిచెప్పి నీవు – ముక్తి దారి– చూపవేగ రండి ||రారండి||
చరణము 4
О........శాంతి – క్రాంతి లేని – లోకవాసికి – ఓ .....శాంతి – క్రాంతి యేసనంచు – చాటుచు భ్రాంతిలోకమందు ప్రీతి వీడ విశ్రాంతి నిచ్చు విశ్వనాథుడంచు – క్రాంతి హృదయమందు నింపి నీవు –నిశాంతమందు– తుదకు చేరవేగ ||రారండి||
చరణము 5
ఓ........నూతన – శతాబ్ద – నడుగుపెట్టిన – ఓ .....నవత – యువత – నూతనోత్సవముతో – దివ్యయేసు – రక్షణంపు – వార్తన్ – నవ్యపద్ధతులతో– నీవు చాటన్ – నిదురబోవు – లోక వాసులన్ – నిదురలేపి – మేలుకొలుపుపాడన్ ||రారండి||