#728

షష్టిపూర్తి ఉత్సవము

రాగం: రాగము : బిలహరి తాళం - త్రిపుట · రచయిత: బోండ్ల సైమన్

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
షష్టిపూర్తి ఉత్సవముసృష్టి కర్త – స్తోత్రములు జేతు – ఈ షష్టిపూర్తి పర్వదినమున చేరి పూజింతు సృష్టిములతో ఈ మానవుని నీ స్వరూపము – నీ పోలికతో – సృజనాత్మకతతో – నీవే సృజియించి నీ సృష్టిపైన పాలన అభివృద్ధి – లొసగితివి – నీ కృపల – దలచుచు ||సృష్టి||
చరణము 1
గర్భవాసిని – యైనది – మొదలు – గర్భమందు – పెంచిన దేవా గర్భమందే – నన్నుయెరిగితివి – నా తల్లి గర్భము – నందే నన్ను ప్రతిష్ఠచేస్తివి – నీ కృపల దలచుచు ||సృష్టి||
చరణము 2
శైశవ – బాల్య – యౌవనములు – వైవాహిక – జీవితము నొసగి భార్యభర్తల – బంధమును వేసి – భవ బంధములు గల – బిడ్డలను – దానముగా –నొసగితివి – నీ కృపల దలచుచు ||సృష్టి||
చరణము 3
విద్యాబుద్ధులు – బల సౌఖ్యములు – మధ్య గొర్రెపిల్ల రక్షణ –మధ్యాకాశ – మార్గములు తెలిపి – ఈ వ్యర్థలోకపు – వ్యర్థ జీవితమార్గములు విడువక – నీ కృపల – దలచుచు ||సృష్టి||
చరణము 4
ఆయు – రారోగ్యముల నిచ్చి – హాయి – ఆనందంబుల నిచ్చిఅన్ని సుఖభోగంబులిచ్చితివి – ఈ అవనియందు – అన్ని ఆశిస్సులు –నొసగితివి – నీ కృపల –దలచుచు ||సృష్టి||
చరణము 5
మానవుని – ఆయుష్కాలంబు – మాయమౌ – ఆవిరివంటిది యౌ –మరుక్షణము – మటు – మాయమౌ పోవు – మానవుని జీవం –పరమపురమున – ప్రభుతో నుండుటకు – నీ కృపలదలచుచు ||సృష్టి||
చరణము 6
కష్టకాలములలో – కర్తగా – కాచి బ్రోచిన – కన్నతండ్రి –నష్టములు కలిగిననూ – నిలిపితివి – నా బ్రతుకు బాటలో –తోడు నీడై – కాచి బ్రోచితివి ||సృష్టి||
చరణము 7
శేషకాలపు శ్రేష్ఠత లెరిగి – స్వామి యేసునిసేవలు చేయనుఅంకితంబు జేతు నా బ్రతుకు – ప్రభు సేవ కొరకు –కట్ట కడవరి – శ్వాస మటునంతకు – ఆ కృపల దలచుచు ||సృష్టి||