#727
వివాహ వార్షిక దినము
పల్లవి · Pallavi
వివాహ వార్షిక దినముదేవా – దీవించుమా దంపతులను – దయతో – నీవు దీవించు మెల్లప్పుడు
చరణము 1
పెండ్లి – అయినది – మొదలు – పలు దీవెనలు – తోడు – దీవించుచు బ్రోచితివి – అటులే – ఈ వత్సరమందు – ఆశిస్సు – లందించి ఆనందింపగ– చేయుమయా ||దేవా||
చరణము 2
సంసార యాత్రలో – సంతాన ప్రాప్తిని – సకల – సంపద – లొసగితివి ఒసగి సంతోష – సౌఖ్యముల – సమకూర్చి – సతతంబు స్వామి – వీరలకొసగుమయా ||దేవా||
చరణము 3
సంకట – స్థితులందు – భంగ – పాటులయందు – బహు ధైర్య – ములనిచ్చితివి ఇచ్చి – నీ బాహు బంధముల – బంధించి రక్షించి – భోగ –భాగ్యము– లొసగితివి ||దేవా||
చరణము 4
ప్రేమాను – రాగముల – సిలువ వృక్షము – నందు – అంటు కట్టబడి వీరల్తుదకు – ప్రేమ – బంధములతో – బంధింపబడి నీలో –బహుగా – ఫలియించునట్లు ||దేవా||
చరణము 5
ఆత్మీయ – శరీర – ఆకలి – దప్పుల – యందు – ఆదరణ – తృప్తి నొసగి ఆత్మ శక్తితో నింపి– నడిపించు – నీ త్రోవను – నిలిచి – నివసింపగ జేయన్ ||దేవా||
చరణము 6
ఇహ లోక – పరలోక – ఈవులన్నియు నిచ్చి – ఈ కవనును దీవించుము కడకు –కడు దీవెనలు – బొండ – కుటుంబ – సభ్యులమై – కృప చూపి –బ్రోవు మేసు ||దేవా||