#726
జన్మదిన వార్షికము
పల్లవి · Pallavi
జన్మదిన వార్షికముసన్నుతింతును దేవా – నీ సన్నిధానమున – సన్నుతింపగ జాలన సకల మేలులు – సర్వ కృపలను –సిలువ విలువలు – ప్రేమ నొసగి – కలుషములు – కడుగంగ నాపై – కరుణచూపిన– కరుణామూర్తి
చరణము 1
గత కాలమందును – కాని చేతలు చేసి – మెెడలలో పడియుంటిని స్థితిని మరచి– నాదు మనవులు – మరల అడుగుచుండగ – మదిని రోయని నాదు పాపము – కడిగి శుద్ధునిచేసినందుకు ||నన్ను||
చరణము 2
పిండాకృతిలో నుండ – దండినాథుడవు – నాదు – గండములు – తొలగించితివిబండలాంటి బ్రతుకు బాటలో – గుండె బరువులు దించి అండగా – ఉండి నాబ్రతుకు– కొండ కుండగా – జీవజల బుగ్గలను ద్రాగుచు ||సన్ను||
చరణము 3
ఆయు – రారోగ్యములు – ఆనంద – సౌఖ్యములు – అనుగ్రహించిన నావిభుడు అనుక్షణంబు – అన్ని విధముల – ఆపదలు కలిగినను ద్రోలి అండ – దండగ ఉండి నన్ను – ఆదరించిన దేవ సుతులు ||సన్ను||
చరణము 4
తల్లిదండ్రులు – అన్న – దమ్ములు – అక్కలు – చెల్లెండ్ర – తోబుట్టువులన్ఎల్ల విధముల – కృపలొసగగ – ఉల్లాసింపగ – ఉర్వియందున – ఎల్లరికి– సువార్త – చాటుచు – యెలమి సాక్షిగ ఇలను నిలుపగ ||సన్ను||
చరణము 5
నూతన – వత్సరమందు – నీతి మార్గము విడువక – నీతి సూర్యుడ నడుపుమయా రోతవంటి – పాత బ్రతుకును పాప పాత వత్సరమందువదలి నీతి – న్యాయము- కరుణ –శాంతులు – నూతననావలో – నొసగు తండ్రి ||సన్ను||
చరణము 6
జన్మనిచ్చిన తండ్రి – జన్మదినంబున – జన్మ జన్మకుల గావుమయా జవము జీవము – నవాలంబమును – పక్షిరాజునకొసగినట్లె మేమతో – హృదయమును– తృప్తితో – నింపి బ్రోవుము నీతో బ్రతుకుచు ||సన్ను||