#725

పెండ్లి ప్రధానం

రాగం: రాగము : జంఝూటి తాళం - ఆది · రచయిత: బోండ్ల సైమన్

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పెండ్లి ప్రధానముమానితమౌ – కార్యములను– మాన్యుడేసే – చేయునుమానుగ వివాహ స్థితిని – మహిని సంకల్పించగ
చరణము 1
పెండ్లి – కార్యక్రమములలో – ప్రధానమే – ప్రధానము పెండ్లి – ఘనము – అన్నిటను – పాన్పు నిష్కళంకము ||మానిత||
చరణము 2
రిబ్కా మరియ కన్యకలకు – జరిగిన ప్రధానంబులు రమ్యముగాను – జరుగుచుండె – నాటినుండి – నేటికి ||మానిత||
చరణము 3
క్రీస్తు – వరుడు – సంఘ – వధువున్ – బెండ్లి – యాడ పరమున కల్వరిందు – సంఘమునకు – ప్రధానంబు – జరిగెను ||మానిత||
చరణము 4
వెండి బంగారు నగలు – వెలగల – వస్త్రంబులు పెండ్లికూతురాదులకు – నొసగనిత్తు – రీ దినం ||మానిత||
చరణము 5
తల్లికి – ముత్తైదువులకు – తగిన రీతి – ప్రేమతో తప్పక – వస్త్రములు – పెండ్లి కొడుకు – వారలిత్తురు ||మానిత||
చరణము 6
తండ్రి సుత – పరిశుద్ధాత్మ – త్రియేక దేవు స్తోత్రములు తరగనట్టి దీవెనలను – తండ్రిమరి – కొసగుమా ||మానిత||