#724

నిశ్చితార్థము

రచయిత: బోండ్ల సైమన్

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నిశ్చితార్థంరాగము : ఆనందభైరవి ఛాయ : కానాపురంబులోకళ్యాణ – శోభతో – కలకాల – ప్రేమతోకరుణాంత – రంగడు – కరుణచూపి కరుణాల – వాలునికమనీయ – సేవలు – కలవరము – లేకుండా – చేయుమెప్పుడూ
చరణము 1
నిశ్చయ – తాంబూల – మిచ్చి పుచ్చుకొనుట – నిక్కమించు – ప్రభువు – నిర్ధారించెనిశ్చయించిన యేసు నీడవలె వెంబడించి – నిరంతంబు – తోడుగ – నిలుచు –మీదో ||కళ్యాణ||
చరణము 2
సంసార – జీవితము – సంగీత – కచేరి – సరిగాను – పదనిసలసాకీలతో స్వరపేటికలు – రెండు – సప్తస్వరాలొకటిగాసంసార – కచేరి సాగునటుల ||కళ్యాణ||
చరణము 3
అపభ్రశ్రు – తులు కలిగించు – అపస్వర రూపంబు – అప్పుడప్పుడు పలుకు – నా స్వరరూపంబు అండగోరుము – యేసు – దండి పండిత – గురువు – గండములు– తొలగించు గాత్రములకు ||కళ్యాణ||
చరణము 4
మధురాను – భూతుల – మధురిమల – హృద్వీణ – మృదుమధుర – రాగాలు మీటునటులతీగ తెగిపోకుండ తియ్యని అనురాగ – రాగములు – పాడగను – రయము మీర ||కళ్యాణ||
చరణము 5
తీగ తెగిపోయిన – తీగసరిచేయుట – మీ తరముకాదని – యెరిగి యెప్పుడు తండ్రి సుత శుద్ధాత్మ – త్రియేకదేవుడు – సరిచేసి – దీవించు – ధన్యులనగ ||కళ్యాణ||