#723
శ్రీ యేసునాథ కథాక్రమము
పల్లవి · Pallavi
శ్రీ యేసునాథ కథాక్రమమురాగము : కళ్యాణి తాళము : అటశ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా – చెలిమితో నాలింపరారేఇయ్యుర్విలో ప్రభువు – హితముగ జేసిన కార్యంబులన్నింటిని – క్రమముగాదెలియరారే నాయము ఒప్పగ అనుదినంబును – నేర్చుకొనుచును అనుసరించినశ్రేయ మొసగును యేసు చరితము శ్రద్ధతో గమనింపరారే ||శ్రీ||– స.సా. సుబ్బయ్య
చరణము 1
బయలుదేరెను దేవుడు – భూమికి తనను ప్రత్యక్షపరచుకొనెను జయముొప్పదూతలు – జగతికి వార్తలను – రయముగా దెచ్చిరి రాత్రి సమయమునప్రియముగా బెత్లేహేమందలి – పేద గొల్లలు పోయి చూచి – నయముగాపూజించి హృదయాలు – ఆనంద మొందిరి – ప్రభుని జూసి ||శ్రీ యేసు||
చరణము 2
జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువునకు – కానుకలు పెట్టి బంగారు సాంబ్రాణి మొదలైనట్టి – కానుకల తో వారు – ఘన-మర్యాదలతోనూ – దీన బాలుని – చూడవచ్చిరి – దివ్యమగు – ఒంటెలను ఎక్కి – శ్రీసుతునిసేవించి వెళ్ళిరి – శ్రీప్రభువుగా స్వస్థానములకు ||శ్రీ యేసు||
చరణము 3
హేరోదు చంపనెంచె – ఆ శిశువును రారాజు అని యెరుగక – కోరిబెత్లేహేము చేరి రెండేండ్ల బాలుర నందరి సంహరించికడతేర్చె భూరి దేవుడు అద్భుతముగా – పారిపోయి ఐగుప్తునకు – క్రూర రాజు – మరణమొందగా –చేరెను నజరేతు గ్రామము ||శ్రీ యేసు||
చరణము 4
మన దేవుడు భూమికి – వచ్చినప్పుడే – నన్ను పేరు పెట్టుకొనెను వినయముతోప్రభువు – వింత బాలునిగా పెరిగెను – ధరణిలో నజరేతు – తనచిన్న గ్రామమున చనువుగా పస్కాకు వెళ్ళెను – సరిగా పన్నెండేండ్లవయస్సున – ఘనుల నడిగెను – ప్రశ్నలెన్నోకడు విస్మయ మొంద వారులు ||శ్రీ యేసు||
చరణము 5
యొర్దాను నది యొద్దను స్నానము పొందె యుక్త వయస్సు – నందున శుద్ధ హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవ నింపు మీరగ జేయ బుద్ధి గలశిష్యులను నలుగురిని – బేత్సయిదాలో పిలిచి వారితో – ఒద్దికతో కానాకువెళ్ళెను – ఒనరగ కళ్యాణమునకై శ్రీ యేసు ||
చరణము 6
ఇరువదియేడవ వర్షమున – పస్కా కొరకై యెరూషలేమునకు వెళ్ళెను పరి శ్రమ పరచెను – ప్రభువు దేవాలయమును – సరిగా తొమ్మిది నెలలు సదయడుక్కడ గడిపి – వెరువకను సమ – రయుల ప్రాంతము – కని సమరయ స్త్రీని కనుగొని – సరగగలిలయ కేగి ప్రభువు స్వస్థపరచె ప్రధాని కొమరుని ||శ్రీ యేసు||
చరణము 7
ఇరువది యెనిమిదవ యేటను – మార్చి నెలలో – యెరూషలేమునకు వెళ్ళెనుమరువక పూర్వము – మంచి పండుగ జరిపి – సరగ బేతెస్దలో – స్వస్థపరచిరోగిని – తిరిగి నజరేతునకు బోయి – గురువుగా గ్రంథమును చదువపరిహసించిరి స్వంత వారలు – ప్రభువు ఇతడని తెలియ నేరక ||శ్రీ యేసు||
చరణము 8
ఆరంభించెను ప్రభువంత – సువార్త సంచారముగలిలయలో నంత కోరిక
చరణము 9
కపెర్నహూం జేరి – తిబెరియ సరస్సు తీరమున శిష్యులన్ చేరబిలిచిన పిదప భూరి దయతోకుష్ఠరోగిని బొలువు మీరగ పక్షవాయువు (4) – ఘోరముగా వ్యాధులలను మానిపి – మేర లేని కీర్తి నొందెను ||శ్రీ యేసు||
చరణము 10
రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి – మండు వేసవి యందున దండి ప్రేమను తన పన్నెండు మంది నొక కొండ మీదను గూర్చి – గొప్ప బోధను జేసి నిండు దయతో పిదప నధిపతి దండి దాసుని బాగుజేసి వండియునునాయీను విధవకు – దండి మేలు నొసగి వచ్చెను ||శ్రీ యేసు||
చరణము 11
పిదప సీమోను ఇంట – యేసు ప్రభువు – ప్రియముగా భుజించెను సదయడు తిబెరియ – సరస్సు తీరమున కేగి – ముదముొప్ప నుపమానములు జెప్పిబోధించి – పిదప సంద్రపు పొంగు నణచి – వదలగొట్టి సేన దయ్యము – తుదకుయాయీరు – కుమారి తనను – ముదముతో బ్రతికించె ప్రభువు ||శ్రీ యేసు||
చరణము 12
మూడవ యాత్రను జేసెను – కపెర్నహూం వ – ముఖ్య స్థానముగా జేసి వేడుకన్శిష్యులన్ వివిధ స్థలముల కంపించి – గోడు జెందక గొబ్బున నడవికి వెళ్ళెడుఐదు-వేల ప్రజలకు – నాడు రొట్టెలు పంచిపెట్టి – చూడ వింతగాసముద్రముపై – గోడు జెందక నడిచి వెళ్ళెను ||శ్రీ యేసు||
చరణము 13
విరోధమెక్కువయై – యేసు ప్రభువని – వింత బోధలు వినగానే – పరలోకపురొట్టె ప్రభువు తానే యనగా – తర్కించ మొదలిడిరి తమలోతామే జనులు మరియు పెద్దవాడుకలను – వెరువకను ఖండించగ సాగగా – యూదుల మనసున ద్వేషభావము – పెరిగెను కపెక్నహూమున ||శ్రీ యేసు||
చరణము 14
ఇరువదితొమ్మిదవ యేటను – ఏప్రిల్ నెలలో అరిగె నుత్తర దిక్కున – ధర తూరు సీదోను – సురోఫెనిక్య స్త్రీతోను – పరముడు మాట్లాడి – కరుణ చూపి వెనుకతిరిగి వచ్చె దెకపొలిలో – జరిపి కొన్ని యద్భుతములను సరస్సు దరిని – నాలుగు వేలకు తిరిగి యాహారంబు పెట్టెను ||శ్రీ యేసు||
చరణము 15
కైసరియ ప్రాంతమున – యేసు ప్రభువు – తన శిష్యులతో వెళ్ళిన – ఆ సమయములోను –యేసు మహాత్మ్యమున – భాసురంపు మహిమ ప్రత్యక్షపరచిన – దోసిలొగ్గి –యేసు శిష్యులు – అసమాహాత్మ్యంబు కనుచుఆ స్థలమున చేరి నిత్యము – వాసమును జేయ జయమొంగ గోరిరి ||శ్రీ యేసు||
చరణము 16
తిరిగి వచ్చు వేళను – యేసుడు తన – మరణవార్తను జెప్పెను సరుగున తన ముఖ్య –స్థానంబు చేరి – పరమ బోధలెన్నో విరివిగా జేసెను – ధరణును గొప్పతనము ఏదో – పరులు క్షమించుట యనకేమో – సరిగా జెప్పి గలిలయానుస్వామి యేసు విడిచి వెళ్ళెను ||శ్రీ యేసు||
చరణము 17
యెరూషలేమున కేగెను – అక్టోబరులో పరిశుద్ధ పండుగకై – పరమ బోధలు జేసె – పర్ణశాలల నాడు – ధర జీవజాలమేదో – సరిగా వివరించెను మరియు లోకపువెలుగు ఏదో – పరమ స్వాతంత్ర్యము ఏదో గుర్తుజెప్పగా – రాళ్ళనెత్తిరి – కరకు యూదులు మత్సరముచే ||శ్రీ యేసు||
చరణము 18
కడవరి సారి వెళ్ళెను – గలిలయాకు – గద్దించ ప్రియులిద్దరిన్ తడవు చేయక యేసు – తన శిష్యులతో గూడి – కడు చేరువలో నున్న – ఘన పెరయాలో చేరిపుడమిలో తన శిష్యులందరు – పూర్ణమనస్సుతో జేయు విధులను – కడు నెనరునజెప్పి వారల – కభయ హస్తము నిచ్చిపంపెను ||శ్రీ యేసు||
చరణము 19
యెరూషలేమున కేగెను మార్గములోనే మరియ మార్తల జూసెను సరుగన మార్గమునందు – స్వస్థపరచి యంధుని – పరిసయ్యులను వింత – పరచి బోధలు చేసి – వరుడుప్రతిష్ఠ పండుగ తరుణమున త – నెన్నెరుక – పరుగగాఅరులు తనను పట్ట జూడగా నందకుండా దాటిపోయెను ||శ్రీ యేసు||
చరణము 20
పెరయా పరిచర్య యందే – యేసు ప్రభువు పెక్కు బోధలు జేసెను పరిసయ్యులు జూడెడి –పరిశుభ్రతను గూర్చి – ఇరుకు ద్వారము గూర్చి హితముగా బోధించి –పరమ విందు దొరికెననియు – సిరిని గూర్చిన కథలు చెప్పి – సిరిని గూర్చినకథలు చెప్పి – ధరణును విశ్వాసమును పెంచెను – తగినబోధలెన్నెన్నో జేసెను ||శ్రీ యేసు||
చరణము 21
బేతనియకు వెళ్ళెను – యేసుడు పిదప బ్రతికించెను లాజరును ఖ్యాతిగ నెఫ్రాయీం – కుష్ఠరోగుల బ్రోచి – ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల – సతీపతుల పరిత్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము – పేతురుకు ప్రత్యుత్తరము అతి ప్రేమతో వివరించి చెప్పెను ||శ్రీ యేసు||
చరణము 22
జేసె యేసునాథుండు యెరూషలేము – చివరిగా ప్రయాణము వాసిగాయెరికోకు – వచ్చి యంధుల బ్రోచి – జూసి జక్కయ్యను వాసిగా దర్శించి – యేసు మీనా – లయము పదము చేసి తుదకు బేతనియలోభాసురముగా మరియచే నభిషేకమొందెను – మరణమునకై ||శ్రీ యేసు||
చరణము 23
ముప్పదవ సంవత్సరము – ఏప్రిల్ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పిదముగా వాహనము నెక్కి జయధ్వనులతో – గొప్ప సమూహముతో గొబ్బున నరిగెను చెప్పజాలని సంతోషముతో – శిష్యులుండ యేసునాథుడు – గొప్ప చింతలో మునిగెనా పురి – ముప్పు నొందును సరిగా ననుచును ||శ్రీ యేసు||
చరణము 24
సోమవారము రోజున – యేసు ప్రభువు – శపించె నొక్క చెట్టును స్వామి ఆ దినమున – సరిగాగుడికి వెళ్ళి – పామరులందరి పారదోలిన వెనుక ప్రేమతో రోగులను స్వస్థపరచి మటంచు బోధలు చేయ నరులు – తామసముతో నిండుకొనుచు – ఏమిజేతుమటంచు సణిగిరి ||శ్రీ యేసు||
చరణము 25
మంగళవారము – చెట్టును యేసు మరల జేవి – చారము సంగతి తెలియకశాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పరచ జూడ రంగము మీరగ మూడుప్రశ్నలు – రయముగా నుపమానములతో భంగపరచెను వారియుక్తులను – ప్రభువు పరిసయ్యులను జూచి ||శ్రీ యేసు||
చరణము 26
మోదమొందెను యేసుడు చందా వేయు – బీద విధవను జూసెను ఆదరించెను ప్రభువు మేదిని హెల్లేనీయులను – యూదజనులంతవిరోధించగా ప్రభుని బోధపరచెను యెరూషలేము – మేదిని నాశనమగునని – ప్రోదిగా లోకాంత వార్తలు – ఆ దినముననే చెప్పి వేసెను ||శ్రీ యేసు||
చరణము 27
బుధవారము రోజున – శిష్యుల తోడ – పూర్ణ విశ్రాంతి నొందె – సదయడు తనగురువారము సంస్కారమును ఇచ్చి – పదిలంబుగా యేసు పరమ బోధలుజేసెన్ – ముదముతో తన ప్రియుల కొరకై – ముఖ్యముగా ప్రార్థించి పిదప సదయడేసుడు గెత్సేమందున – శత్రువుల చే పట్టు వడియె ||శ్రీ యేసు||
చరణము 28
శుక్రవారము నందున యేసు ప్రభువు – పెక్కు శ్రమల నొందెను – అక్రమముగ యూదు – లన్యాయ నేరముల్ – పెక్కు మోపికడకు – పెద్దనేరస్థుడని మిక్కుటంపు నీచమైన మ్రానును వ్రేలాడదీసి – పెక్కు బాధలు పెట్టి చంపిరిప్రక్కలో బల్లంబు గుచ్చిరి ||శ్రీ యేసు||
చరణము 29
శనివారము రోజున – యేసు దేహము – సమాధిలో నుండెను – ఘనుడు ఆదివార – మాన సమాధిని విడచే – తనకు తానే చూపించి ఇరుపొసకొన వచ్చె – తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను –పునరుత్థానుడు యేసు నలుబది – దినములకు – పరమందున నిలిచెన్ ||శ్రీ యేసు||
చరణము 30
మగ్దలేనే మరియకు – మొదటనే యేసు – మరువక కనబడెను – ఇద్దరిలో ప్రభువు – ఇతర స్త్రీలకు పిదప – అదినమందున నెమ్మాయు శిష్యులకును బుద్ధి తెలిసిన పేతురుకు పరి – శుద్ధ తోమా ఇతర శిష్యుల యొద్దలేనప్పుడు ఉన్నప్పుడును ఒద్దికతో కనబడెను ప్రభువు ||శ్రీ యేసు||
చరణము 31
గలిలయలో కనబడెను – ఏడుగురికి – ఘన తిబెరియ సరస్సు యొద్ద – తలచియే ||శ్రీ యేసు||
చరణము 32
బేతనియకు వెళ్ళెను కడవరి సారి – ప్రియ శిష్యులతోడను – ప్రీతిగ వారితో – ప్రియమొప్ప మాట్లాడి – చేతులెత్తి యంతనా – శీర్వదించుచు వారినిభూతలంబును విడిచి యేసు – ఖ్యాతిగ పైకెక్కి పోవగ – దూతలిద్దరు వచ్చిచెప్పిరి దుఃఖపడవద్దంచు వారిని ||శ్రీ యేసు||
చరణము 33
పరలోకమున నున్నాడు – ఇప్పుడు మనకై – ప్రార్థనసరిగా చేయును త్వరలో – మురుపుగా తన భక్తులందరి పరమునకు గొనిపోసరుగన – పరమదూతలు పరివృతుడై – అరుగుచున్నాడదియు వినుడి ||శ్రీ యేసు||
చరణము 34
ధరలో యేసును నమ్మండి – త్రిత్వము పేర – వర బాప్తిస్మము నొందండి సరిగ మీరుక్రీస్తు సంఘము నందున జేరి – పరిశుద్ధ వర్తనతో అరమరలేకను తిరిగి –చిరసుఖములను బొందరండి – పరమ కరుణా – కరుడు యేసుడుధర పరములందతడు మనకాదరణ చూపు దండి దేవుడు ||శ్రీ యేసు||