#722
యువజన సంఘ భజన కీర్తనలు
పల్లవి · Pallavi
యౌవనస్థుల భజన కీర్తనలువలయాకారముగా నిలువబడి అభినయము చేయుచు పాడవలెనురమ్ము రమ్ము ఓ పరిశుద్ధాత్మా – మమ్ములను మరువకను – ఇమ్మహిలో మా తోడు నీవు యని – హితముగా వేడుదును
చరణము 1
దోసిలొగ్గి నిన్ను వేడుచుండగా – యేసు నామమునను – నీ శుభములకై కాచియుండగా – దాసుల మొర వినుము
చరణము 2
శిరములు వంచి కరములు మోడ్చి – మొరలు పెట్టగానూ – పరమ వరములను – కుర కుర మాపై – గురియింపుమికను
చరణము 3
మోకరించి నిన్ను వేడుచుండగా – మోదము చూపుచునూ – నీకై మ్రొక్కుచు బ్రతిమిలాడగా – ఏకమనస్సుతోనూ ||
చరణము 4
యేసు నామమున లేచి నిలబడి – ఎంచుచు మేలులను – వాసిగ భజనలు చేసి నుతింతుము – నీ సహాయమునను