#720

వచ్చి చూడుడి

రాగం: (ఛాయ: పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా) · రచయిత: స.సా. సుబ్బయ్య

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
వచ్చిచూడండివచ్చి చూడుము అన్నా – పరమ క్రీస్తు నిప్పుడే – హెచ్చైన శుభములు ఇచ్చునదితడే
చరణము 1
యేసే మన రక్షకుడు – యేసే దేవుడు – వాసిగ రక్షింప వచ్చినాడిలకు
చరణము 2
మనలను రక్షింప – మరణంబు నొంది – తనకు తాను లేచి ఘనుడయ్యెను యేసు
చరణము 3
మేము చూస్తిమి ఆ స్వామిని నిజము – ప్రేమగలవాడతడు ఈ మాట వినుము
చరణము 4
ఇహమున కనలేము – ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు
చరణము 5
ఇతడే మన దేవుడు వినుము ఓ యన్నా ఖ్యాతి లోను మనకు సద్గతి ఇతడే యన్నా