#718
కరుణానిలయ నా ఆశలలో
పల్లవి · Pallavi
కరుణానయనాలలో – అరుణకిరణాలు నా యేసుచూపులు – నవజీవ కణాలు
చరణము 1
యేసు అడుగులిడిన చోటు పుణ్యయాత్రా స్థలము – యేసు లేని లోటు ఎటుల పూరించగలము ||కరుణా||
చరణము 2
యేసు రుధిర ధారలలో – దివ్యాతి దివ్య శక్తి కలదు – యేసు రాకడతోనే శ్రమలకైసెలవు ||కరుణా||
చరణము 3
ప్రభు యేసు స్వరతరంగాలు – పాడినవి విజయ గీతములు – పరమపురిదరి చేరువారు – పయనమై యున్నారు ||కరుణా||