#716
మందార మకరంద మాధుర్యమున
పల్లవి · Pallavi
మందార మకరంద మాధుర్యమున తేలు – మధుపమానా హృదయమా
చరణము 1
యేసు పదముల వ్రాలి – అమృతధారను గ్రోలి – ఆనందమున తేలుమా (2)పరమ సింహాసనముపై కెగిరియుమా ||మందార||
చరణము 2
నిర్మల మందాకిని వీచికలో తూగు (2) రాజహంసా నా మానసా హంసాయేసు వాక్యతరంగ, డోలికపై ఊగి హాయిగా విహరింపుమా – మోక్ష సంధాయకునివరియించుమా ||మందార||
చరణము 3
లలిత రసాల పల్లవా – ఖాదియై వెలుగు కోయిలమ్మ – హృదయ విహంగమా – యేసు తరు శాఖపై – ఏపుగా కూర్చుండి – జీవ ఫలములను – భుజింపుమా – రక్షకుని ప్రేమ శృతి పాడుమా ||మందార||
చరణము 4
పూర్ణేందు చంద్రికా స్ఫురితమై వెలుగొందు – చకోరమా – నాజీవనా పతాకమా – యేసు వెలుగులు చిందు – భాసురంబగు విందు పరమార్ధమునూ చూపెనే– వెన్నెల – కరుణామృతము కురిసెనే ||మందార||