#715
తంబుర నాద స్వరముల తోడ
పల్లవి · Pallavi
తంబుర నాద స్వరముల తోడ తగు విధి నిన్ను భజన చేతు అంబరంబున కెగసే పాటలు హాయిగ పాడెద పాడెద
చరణము 1
సితార స్వర మండలములతో – ఈశ్వర నిన్ను భజన చేతు – ప్రతిదినమున నీ ప్రేమగాథను – ప్రస్తుతించి పాడెద పాడెద
చరణము 2
మృదంగ తాళ ధ్వనులతో – మృత్యుంజయు నిన్ను భజన చేతు – ఉదయసాయంత్రముల యందు – హొసన్నా యని పాడెద పాడెద
చరణము 3
పిల్లనగ్రోవిని చల్లగనూది – వల్లభ నిన్ను భజన చేతు – వల్లభుడన నాఎల్లవేళల – హల్లెలూయా యని పాడెద పాడెద