#714

యేసుని వదనము అందమని

రచయిత: ఆచార్య ఆర్.ఆర్.మూర్తి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుని వదనము అందమని – యేసుని వచనము మధురమని – యేసునిచరణమే శరణమని – యేసు చెంతకు వచ్చితిని –హల్లెలూయా... (4) హల్లెలూయని పాడితిని
చరణము 1
యేసుని సిలువే విలువయని – యేసుని రక్తమే విజయమని – యేసే పునరుత్థానమని –వాసిగ యేసుని నమ్మితిని ||హల్లెలూ||
చరణము 2
పాపిని నన్ను రక్షించెనని – శాపము బాపిన దేవుడని – పరమునకు నన్నుచేర్చునని త్వరపడి యేసును చేరితిని ||యేసు||