#713
యేసు ప్రభు నీ చరణం
పల్లవి · Pallavi
యేసు ప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
చరణము 1
నీ ప్రేమ కథా శ్రవణం నీ శుభ నామ స్మరణం – నా జీవన తరుణోపాయంనా యాత్రకు నిరుపాయం ||యేసు||
చరణము 2
నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవ కిరణం – నీ శాంతి కాంతి నిలయం– నా హృది నీ దేవాలయం ||యేసు||