#712
మనసా మనసా
పల్లవి · Pallavi
మనసా మనసా నీకిది తెలుసా – మానవ జీవిత వరససా – మానని జీవ రభస ||మనసా||
చరణము 1
ప్రేమామయుడు – యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును విశ్వసించి పరలోక ప్రేమను – నిత్యము పొందుట నీ విధియే ||మనసా||
చరణము 2
పాప శాప భారములన్నింటిని – పారద్రోల వ్రేలాడె సిలువపై – పుణ్య రక్తధారలు కార్చిన – గణ్యుడు యేసే నీ శరణ్యం ||మనసా||