#711

బ్యూలా దేశము నాది

రచయిత: ఆచార్య ఆర్.ఆర్.మూర్తి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
బేయులా దేశము నాది సుస్థిరమైన పునాది –కాలము స్థలము లేనిది సుందర పురము – నందనవనము ||బేయులా||
చరణము 1
స్పటికనది తీరము నాది అన్నింటిలో ఘనము అనాది – అపశృతి లేని రాగములు అలరెడి పురము యేసుని వరము ||బేయులా||
చరణము 2
జీవ వృక్షఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శవేది – మరణము బాధలేనిది– అమరుల పురము మంగళకరము ||బేయులా||