పల్లవి · Pallavi
దేవా నా దేవా నన్నేలవిడిచితివి నన్ను రక్షింపవు – నా మొరను వినవెల ||దేవా||
చరణము 1
బదులేల చెప్పవు – అది బాధలో ఉన్నాను – మానవుడనే – కాదు దేవాదేవా – నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||
చరణము 2
ప్రజలెల్ల నన్ను చూసి – పరిహాస మాడెదరు – నాకు దూరము కాకు దేవా– నా దేవా – నన్ను విడువకుమా దేవా ||దేవా||
చరణము 3
బాషాను వృషభము బలమైన సింహాలు – వన్య మృగములు నన్ను వెంటాడెదేవా – నా దేవా నన్ను విడువకుమా దేవా ||దేవా||