#707

దేవా నేను నీవాడను

రాగం: ఛాయ: నేను నీ వాడను దేవా · రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దిక్కంబిగ దేవా వేడుచునుంటిమి – స్త్రీల మైత్రిని దేవా వర్ధిల్ల చేయుమీ
చరణము 1
స్త్రీ మైత్రిలో చేరు స్త్రీల నందరి కృపతో చాలా దీవెనలిచ్చి చక్కగా నడిపించు ||దేవా||
చరణము 2
ప్రార్థనలయందు – ప్రభువు సేవయందు సార్థకముగా నీకై సాక్ష్యమిచ్చుటయందు ||దేవా||
చరణము 3
మాటయందును మరియు – మేటి కార్యములందు తేట క్రైస్తవ బ్రతుకు –చాటి చూపుట కొరకు ||దేవా||
చరణము 4
పరిశుద్ధ వివాహ పవిత్రతను ఎరిగి మరణాంతమగు దనుక స్థిరముగాజీవించ ||దేవా||
చరణము 5
పిల్లలందరిన్ ప్రభు భయమునందున బెంచ తల్లులందరి కెప్పుడు – తగుసాయమియ్యను ||దేవా||