#706

స్త్రీల మైత్రి

రాగం: ఛాయ: మద్యపానము దరికి పోకండి · రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
స్త్రీల మైత్రిలో చేర రారమ్మ–శ్రీ యేసుప్రభుని శ్రేయము చెప్పగ కొలువ రారమ్మస్త్రీల సేవను ప్రేమతో గొని చాలా దయతో చేర దీసి మేలు చేసి యాదరించినయేసు పేరిట సేవచేయును ||స్త్రీల మైత్రితో||
చరణము 1
భక్తురాలండ్రగు స్త్రీల పరిచర్యన్ – ప్రభుయేసు ధరణిలో మక్కువ తోఅంగీకరించెనుగా శక్తి గల యా రక్షకుడు – ఎక్కువగయాదరణ చూపి తక్కువగు మన స్త్రీల స్థితినిల యుక్తముగా బహు యుద్దరించెను ||స్త్రీల మైత్రితో||
చరణము 2
స్త్రీలు అందరూ సేనగా చేరి – స్థిరమైనమైత్రిలో – మేలుగా రక్షకునిగొనియాడె – వీలుగా మన దేశమునకు పాలు మాలక సేవ చేసి – చాలగామన యేసు ప్రేమను చక్కగా ప్రత్యక్షపరచును ||స్త్రీల మైత్రిలో||
చరణము 3
దక్షిణ ఇండియా సభలో ఉన్నట్టి – స్త్రీలంత గూడి – ఏకమగు సహవాసమందుండి– దీక్షతో ప్రార్థనల యందు – సేవ యందు సాక్ష్యమందు – రక్షకుండగుయేసు శక్తిని స్పష్టముగా నిలచాటి చూపక ||స్త్రీల||