#705

యేసుప్రభువు సిలువ మీద

రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుప్రభువు సిలువ మీద – ఏడుమార్లు – ఆశతోడ పల్కెను – భాసురంపుపల్కులు – దాసజనులు తలపోయ దండి ధైర్యమిచ్చును
చరణము 1
తండ్రి వీరు చేసేదేమో – తెలియకున్నారు – దండించ వద్దని దయతోడవేడెను – నిండు జాలి శత్రువులపై మెెండు తాల్మి చూపెను
చరణము 2
చూడు నీవు పరమునందు – నేడే యుందువు తడువలేక నాతోడు – అని తెల్పెదొంగతో కడు దీనత వేడ పాపిని కరుణ తోడ కాచెను
చరణము 3
అమ్మా ఇదిగో నీ కుమారుడంచు తల్లితో నెమ్మమితో యోహానును – నమ్మకంపు– శిష్యుని – ఇమ్ముగా మరియమ్మ తల్లిగా – సమ్మతితో చూపెను
చరణము 4
చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే – దప్పిగొనుచున్నానని దండి కేకవేసెను – దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి
చరణము 5
నాథా దేవా నాదు చెయ్యి – నేల విడిచితి – నన్నేల వీడితివని కేక వేసెనుబాధలెంతొ హెచ్చుకాగా బహుగా విలపించెను
చరణము 6
సకల వరుల రక్షణంబు – సిలువ యందున – సమకూడె గావున – స్వామియొక్క కార్యము – ఇక సమాప్తమైనదంచు వీకతో ప్రకటించెను
చరణము 7
తండ్రి నాదు ఆత్మ నీకు నిండు ప్రేమతో అప్పగించుచున్నానని చెప్పి ప్రాణం వీడెను – మెెండు శాంతి తోడ యేసు మెెల్లగా నిద్రించెను