#703

యువజనులకు పిలుపు

రాగం: ఛాయ: ఉదయమాయెనను · రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యువజనులకు పిలుపుయువజనులంతా – యేసుని పేరిట – ఏకము కావలెను భువిలోయేసుని – ప్రేమను చాటను – బూని కదలవలెను ||యువ||
చరణము 1
యేసే మాదిరి – యేసే రక్షకుడు – యేసే దేవుడని వాసిగా యేసుని జాడలోనడువగ నాశతో బూనుదము ||యువ||
చరణము 2
ప్రార్థన జేతుము – ప్రతి దినమును మన పరమ తండ్రికి ఇలలో సార్థకముగాసహవాస తండ్రితో – సతతము చేయుదము ||యువ||
చరణము 3
దేవుని వాక్యము త్రోవకు వెలుగది – భావము మార్చునని జీవము నొందగాదినదినమున నొక భాగము చదువుదము ||యువ||
చరణము 4
సంఘము యేసుని శరీరమేయని – సేవకు బూనుదము సంఘపు క్షేమమేమదిలో నిడుకొని – సాయము చేయుదము ||యువ||
చరణము 5
సేవను చేసి సాక్ష్యము నిచ్చి – యేసుని చూపుదాము ఏ విధముననో యేసుని యొద్దకుఆత్మల నడుపుదాము ||యువ||