#702
లేమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియు
పల్లవి · Pallavi
క్రైస్తవ సంఘమా! లేమ్ము తేజరిల్లుము!!లేమ్ము తేజరిల్లుమునీకు – వెలుగు వచ్చియున్నది యేసుని మహిమ నీపై – ప్రకాశముగనుదయించె ||లేమ్ము||
చరణము 1
యేసే ఈ లోకమునకు – వెలుగైయున్నానని చెప్పెన్ యేసుని నమ్మువారు – వెలుగులో నడుచువారు ||లేమ్ము||
చరణము 2
అంధకారమందుండి – బంధింపబడినవారిన్ఆశ్చర్యమైన వెలుగు – నందించి విమోచించెన్ ||లేమ్ము||
చరణము 3
దాత ప్రభు యేసుని నమ్మి – నీతిగానడుచువారు జాతి భేదములు లేక – జ్యోతుల వలెనుందురు ||లేమ్ము||
చరణము 4
మనుజులు మీ సత్క్రియలను – చూసి బహు సంతోషించిమనసార పరమ తండ్రిని – మహిమ పరచెదరు ||లేమ్ము||
చరణము 5
జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయకాంతికివచ్చెదరు ||లేమ్ము||