#701
స్తోత్రము చేయుదుము పాత్రుడవు నీవే రాత్రి
పల్లవి · Pallavi
క్రీస్తు అవతారము కొరకు స్తోత్రముస్తోత్రము జేతుముపాత్రుడ నీవే రాత్రిలో మా ప్రియ తండ్రిస్తోత్రములివే గొనుమా మా స్తోత్రములివే గొనుమా ||స్తోత్రము||
చరణము 1
లోకమునెంతో ప్రేమించి – ప్రాకటముగా రక్షింపగాక్రీస్తును – ఇల మా కొర కిచ్చినందుకై ||స్తోత్రము||
చరణము 2
ధనవంతుడగు మా ప్రభువు ధనికులుగామము చేయను దీనుడుగా ఇల అవతరించి బహు ధన్యులుగా మము చేసినందుకై ||స్తోత్రము||
చరణము 3
పాపులమగు మము ప్రేమించి – పాపము పరిహరింపగాతాపమెంచక సిలువ నొంది నీ దాపుకు మమ్మును చేర్చినందుకై ||స్తోత్రము||
చరణము 4
ఒప్పగు క్రిస్మసు నందున మెప్పగు మాకొర కిచ్చిన చెప్ప శక్యము గాని వరముకై గొప్పగా మా స్తుతులందుకొనుము జై ||స్తోత్రము||